చికిత్స పొందుతూ 'అతని' భార్య మృతి | Husband Assassinated Wife in Karnataka | Sakshi
Sakshi News home page

భార్యకు ఉరేసి హత్యాయత్నం

Mar 10 2020 7:47 AM | Updated on Mar 10 2020 7:47 AM

Husband Assassinated Wife in Karnataka - Sakshi

భర్త వెంకటప్పతో నాగవేణి (ఫైల్‌)

మైసూరు: సీడీపిఓ ఉద్యోగి అయిన వెంకటప్ప అనే వ్యక్తి భార్యపై హత్యాయత్నం చేయగా, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతని భార్య నాగవేణి(41) సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మైసూరు జిల్లాలోని టీ.నరసిపుర తాలూకాలోని శిశు సంక్షేమ శాఖలో సహాయ అధికారిగా పనిచేస్తున్న వెంకటప్ప 1997వ సంవత్సరంలో నాగవేణికి పెళ్ళి చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యను వేధించడంతో పాటు వరకట్నం కోసం తీవ్రంగా కొట్టి హింసిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన తెల్లవారుజామున భార్య నిద్రపోతూ ఉండగా ఆమె మెడకు చీరను బిగించి ఉరి బిగించి చంపబోయాడు. ఆమె కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంటూ ప్రాణాలు విడిచింది. నాగవేణి ఆస్పత్రిలో చేరిన రోజే బంధువులు వెంకటప్పపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి నాగవేణి నుంచి వాంగ్మూలం తీసుకున్నాడు. మైసూరు నగరంలోని జయపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement