ఏసీబీ అధికారులమంటూ.. దమ్కీ! | Fraud In The Name Of ACB | Sakshi
Sakshi News home page

మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

Jul 2 2018 3:49 PM | Updated on Oct 4 2018 8:29 PM

Fraud In The Name Of ACB - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పంజాగుట్ట : ఏసీబీ అధికారులమంటూ ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..కొద్దిరోజుల క్రితం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని రేణుకకు ఫోన్‌ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులమంటూ ఆరు లక్షలు డిమాండ్‌ చేశారు. దీనిపై రేణుక పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులైన మొహ్మద్‌ అలీం సబీర్‌, సయ్యద్‌ ఉస్మాన్‌ అలీ, ఫాతిమా, ఖాజా మొయినుద్దీన్‌, విజయ్‌, సయ్యద్‌ సమీర్‌లను అరెస్టు చేశారు. వీరి వద్దనుంచి ఓమ్ని కారు, స్టాంప్‌ పేపర్లు, ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 384,388,419,365ల కింద కేసు నమోదు చేసామని ఏసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement