మధ్యప్రదేశ్‌ ఘోర రోడ్డు ప్రమాదం.. | Four People Killed In Madhya Pradesh Road Accident | Sakshi
Sakshi News home page

Jun 24 2018 11:01 AM | Updated on Oct 8 2018 3:19 PM

Four People Killed In Madhya Pradesh Road Accident - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజయింది. ఇండోర్‌-భూపాల్‌ హైవేపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.

చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement