పుట్టిన రోజు వేడుకల్లో విషాదం | Four Men Died in Road Accident Karnataka | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజు వేడుకల్లో విషాదం

May 20 2019 7:17 AM | Updated on May 20 2019 7:17 AM

Four Men Died in Road Accident Karnataka - Sakshi

కర్ణాటక, బనశంకరి: రోడ్డు పక్కన పుట్టిన రోజు జరుపుకుంటున్న యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు   దుర్మరణం చెందిన ఘటన బీదర్‌ జిల్లా మున్నాఖేళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం అర్దరాత్రి చోటుచేసుకుంది. మృతులు బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌ తాలూకాకు చెందిన సచిన్‌హణమంత (18), అరుణ్‌ కుమార్‌ కాశీనాథ (19),గురునాదవిఠల(18), రఘవీర బీమశ్య (17)గా గుర్తించారు. నలుగురు స్నేహితులు శనివారం అర్దరాత్రి పుట్టిన రోజు జరుపుకోవడానికి మంగలగి సమీపంలోని జాతీయ రహదారి 65 వద్దకు వెళ్లారు. యువకులు పుట్టిన రోజు వేడుకల్లో సంబరాలు చేసుకుంటుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో యువకులు అక్కడిఅక్కడే మృత్యవాతపడ్డారు. ఈ దుర్ఘటనను గుర్తించిన స్థానికుడు తక్షణం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్ధలానికి వెళ్లిన మున్నాఖెళ్లి పోలీసులు మృతదేహాలను హుమ్నాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  గుర్తు తె లియని వాహనం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement