అగ్ని ప్రమాదంలో నలుగురి మృతి | Four die in Delhi fire | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో నలుగురి మృతి

Apr 9 2018 1:48 PM | Updated on Sep 5 2018 9:47 PM

Four die in Delhi fire  - Sakshi

ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ

న్యూఢిల్లీ : బూట్ల ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతిచెందారు.  ఈ సంఘటన ఢిల్లీలోని సుల్తాన్‌పురి రాజా పార్క్‌ ఫ్యాక్టరీలో ఉదయం 6.35 గంటలకు జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 12 మంది కార్మికులు ఉన్నట్లు ఢిల్లీ అగ్నిమాపకశాఖాధికారి చెప్పారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. 

మంటల్లో చిక్కుకుని తీవ్రగాయాలతో నలుగురు కార్మికులు అప్పటికే చనిపోయారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. చనిపోయిన వారిని సంజయ్‌ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతులను గుర్తించాల్సి ఉంది.  షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement