విదేశీ విద్యార్థి అనుమానాస్పద మృతి | Foreign Student Suspicious death | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యార్థి అనుమానాస్పద మృతి

Apr 16 2018 8:44 AM | Updated on Oct 4 2018 7:01 PM

Foreign Student Suspicious death - Sakshi

సాలీహ్‌ అబ్డీన్‌ మృతదేహం

మౌలాలి: క్వారీ గుంతలో పడి విదేశీ విద్యార్ధి అనుమానస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుడాన్‌ దేశానికి చెందిన సాలిహ్‌ అబ్డీన్‌ సాలీహ్‌ అలియస్‌ కోహా(28) నగరంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీ ఫార్మసి చదువుతుతూ ఓయూ టీచర్స్‌ కాలనీలోని రాఘవేంద్రహిల్స్‌ ఎమ్మార్‌ రెసిడెన్సీలో ఉంటున్నాడు. శనివారం రాత్రి తన స్నేహితులు సబ్రా, కెల్విన్, సండ్రా, హ్యాపి, రేమాండ్, గాడ్విల్లతో కలిసి ప్లాట్‌లో విందు చేసుకున్నారు. స్నేహితులు వెళ్లిపోవడంతో ప్లాట్‌లో ఒక్కడే ఉన్నాడు. ఉదయం స్నేహితులు వచ్చి చూసేసరికి అతను క్వారీ గుంతలో మృతి చెంది ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement