విషాదం: మంటలు ఆర్పేందుకు వెళ్లి.. | Fireman Deceased In Fire Accident In Anantapur | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక ఉద్యోగి సజీవ దహనం

Apr 26 2020 5:02 PM | Updated on Apr 26 2020 5:10 PM

Fireman Deceased In Fire Accident In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఓ అగ్నిమాపక ఉద్యోగి అగ్నికీలలకు ఆహుతి అయ్యాడు. ఈ సంఘటన పెనుగొండ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పెనుగొండ మండలం రాంపురం సమీపంలోని గుజిరి గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అక్కడివారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమించసాగారు. ఈ నేపథ్యంలో పరంధామ అనే అగ్నిమాపక ఉద్యోగి మంటల్లో పడి సజీవ దహనమయ్యాడు. భారీగా మంటలు ఎగిసిపడుతుంటంతో వాటిని అదుపుచేయటం సాధ్యంకావటంలేదు. ఇప్పటికే కోటి రూపాలయ ఆస్తి నష్టం సంభవించింది.

చదవండి : ఆ వాచ్‌మ్యాన్‌‌ నిజంగా దేవుడు! 

ఒకే కుటుంబంలో 18 మందికి క‌రోనా 

Advertisement
 
Advertisement
Advertisement