ఒకే కుటుంబంలో 18 మందికి క‌రోనా | Sakshi
Sakshi News home page

బుస‌లు కొడుతున్న క‌రోనా

Published Sun, Apr 26 2020 4:18 PM

18 Of Family Tests Coronavirus Positive In Uttar Pradesh - Sakshi

లక్నో: క‌రోనా అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతోంది. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకున్నా అది బుస‌లు కొడుతూనే ఉంది. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన‌ ఓ కుటుంబంలో 18 మందికి క‌రోనా సోక‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివ‌ర్సిటీకి చెందిన ఓ విద్యార్థి గ‌త నెల సంత్ క‌బీర్‌న‌గ‌ర్‌లోని మఘ‌ర్ ప్రాంతంలో ఉన్న త‌న‌‌ స్వ‌గృహానికి వ‌చ్చాడు. ఈమ‌ధ్యే అత‌నికి వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆసుప‌త్రిలో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది. (వీడియోతో అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్‌!)

దీంతో అధికారులు అత‌నితోపాటు స‌న్నిహితంగా మెలిగిన 27 మంది న‌మూనాల‌ను గోర‌ఖ్‌పూర్‌లోని బీఆర్డీ మెడిక‌ల్ క‌ళాశాల‌కు పంపారు. అందులో 18 మందికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో వారంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో నివ‌సిస్తున్న‌వారు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. కాగా అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించి ప‌టిష్ట బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు. ఇదిలా వుండ‌గా ఇప్ప‌టివ‌ర‌కు ఉత్త‌ర ప్రదేశ్‌లో 1793 కేసులు న‌మోద‌వ‌గా 27 మంది మృతి చెందారు. భార‌త్‌లో క‌రోనా వైర‌స్ రోగుల సంఖ్య 26,496 ఉండ‌గా 5804 మంది డిశ్చార్జ్ అయ్యారు (పెళ్లి వార్షికోత్స‌వ‌ వేడుక‌లు: భ‌ర్త‌కు క‌రోనా)

Advertisement
Advertisement