కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Fire Broke Into Running Car In Araku - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విహార యాత్రకు వెళుతున్న ఓ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగిన సంఘటన విశాఖ జిల్లాలోని అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. గురువారం అనంతగిరి మండలంలోని తైడా సమీపంలో మైదాన ప్రాంతం నుంచి అరకు అందాలను చూడడానికి వెళుతున్న ఓ టూరిస్టు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అందులోని వారు అప్రమత్తంగా ఉండటంతో క్షేమంగా బయటపడగలిగారు. ఈ కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్‌తో ఉంది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top