భార్యపై అనుమానం..కూతురి హత్య | Father Murdered His Daughter In Thandur | Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానం..కూతురి హత్య

May 24 2019 6:20 PM | Updated on May 24 2019 6:20 PM

Father Murdered His Daughter In Thandur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తాండూరు: వికారాబాద్‌ జిల్లా తాండూరులో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురిపాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకుని కన్న కూతురిని హత్య చేశాడు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ ప్రాంతానికి చెందిన రాజు స్థానికంగా నివాసం ఉంటూ కోనాపూర్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ పాలిష్‌ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఆయనకు ఐదేళ్ల కూతురు ఉంది. ఇటీవల తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కూతురు తనకు పుట్టలేదని అనుమానంతో ఆ చిన్నారిని చంపి సుద్ధగని గుంతలో పడేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement