పంట నష్టంతో రైతు ఆత్మహత్య | Farmer's suicide with crop loss | Sakshi
Sakshi News home page

పంట నష్టంతో రైతు ఆత్మహత్య

Apr 8 2018 2:14 AM | Updated on Oct 1 2018 2:36 PM

Farmer's suicide with crop loss  - Sakshi

పినపాక: ఈ నెల 4న కురిసిన వడగండ్ల వానతో వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెంలో శని వారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండ సమ్మిరెడ్డి(45) అప్పులు తెచ్చి వరిసాగు చేశాడు.

పంట బాగానే పండినప్పటికీ అకాలవర్షంతో పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో అప్పులు తీర్చలేననే మనోవేదనతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు భద్రాచలం ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement