కట్నం వేధింపులకు వివాహిత బలి | Extra Dowry Harassments Women Died in Karnataka | Sakshi
Sakshi News home page

కట్నం వేధింపులకు వివాహిత బలి

Jun 18 2019 8:07 AM | Updated on Jun 18 2019 8:07 AM

Extra Dowry Harassments Women Died in Karnataka - Sakshi

మృతదేహం ,శ్వేత (ఫైల్‌)

కర్ణాటక , కృష్ణరాజపురం : అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం హగ్గనహళ్లి క్రాస్‌లో చోటు చేసుకుంది. నాగమంగల ప్రాంతానికి చెందిన శ్వేతకు పదేళ్ల క్రితం బెంగళూరు నగరానికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తితో వివాహమైంది. కొద్ది కాలం సవ్యంగానే ఉన్న సంతోష్‌ కుటుంబ సభ్యులు కొద్ది కాలంగా అదనపు కట్నం కోసం శ్వేతను వేధించసాగారు. భర్త సంతోష్‌తో పాటు అత్తమామల వేధింపులు కూడా రోజురోజుకు తీవ్రతరం కావడంతో వేధింపులు తాళలేక సోమవారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజగోపాల్‌ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement