నవవధువుకు వరకట్న వేధింపులు | Extra Dowry Harassment on Bride in Krishna | Sakshi
Sakshi News home page

నవవధువుకు వరకట్న వేధింపులు

Feb 3 2020 12:55 PM | Updated on Feb 3 2020 12:55 PM

Extra Dowry Harassment on Bride in Krishna - Sakshi

కృష్ణాజిల్లా, అజిత్‌సింగ్‌నగర్‌: పెళ్లైన నాలుగు నెలలకే అత్తింటి వారి నుంచి ఓ వధువుకు అదనపు కట్నం వేధింపులు ఎదురైన సంఘటన నున్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నున్న గ్రామానికి చెందిన ఊటుకూరి వెంకాయమ్మ(19)కు అదే గ్రామానికి చెందిన డేవిడ్‌ అనే ఎలక్ట్రీషియన్‌కు ఇచ్చి నాలుగు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు కూడా ఇచ్చారు. అయితే భర్త డేవిడ్‌ అతని తల్లి, మేనమామలు పుట్టింటి నుంచి ఇంకా అదనపు కట్నం తీసుకురమ్మంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. వారి వేధింపులతో విసిగిపోయిన ఆమె నున్న రూరల్‌ పోలీసులను ఆశ్రయించగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకూ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement