సీఎస్‌పై దాడి చార్జిషీట్‌లో కేజ్రీవాల్‌ పేరు | Delhi Police files chargesheet against Arvind Kejriwal, Manish Sisodia | Sakshi
Sakshi News home page

సీఎస్‌పై దాడి చార్జిషీట్‌లో కేజ్రీవాల్‌ పేరు

Aug 14 2018 2:39 AM | Updated on Aug 14 2018 2:40 AM

Delhi Police files chargesheet against Arvind Kejriwal, Manish Sisodia - Sakshi

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలను నిందితులుగా చేరుస్తూ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సమర్‌ విశాల్‌కు సమర్పించిన చార్జిషీట్‌లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మరో 11 మంది ఎమ్మెల్యేల పేర్లున్నాయి. ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ను అధికారిక విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు, గాయపరిచేందుకు కేజ్రీవాల్, సిసోడియా తదితరులు కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, చంపేస్తామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. కాగా, చార్జిషీటుపై ఈనెల 25వ తేదీన విచారణ చేపడతామని మెజిస్ట్రేట్‌ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement