దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌ | Delhi Police Busts Major Terror Module, Arrests 5 Including Chemical Bomb Expert | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

Sep 11 2025 1:33 PM | Updated on Sep 11 2025 1:37 PM

Delhi Police Foils Major Isis Terror Plot

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని బోధనలో ఒకరిని అరెస్ట్‌ చేశారు. పాక్‌ హ్యాండ్లర్లతో కలసి టెర్రరిస్టులు దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్‌ అయినవారిలో కెమికల్‌ బాంబుల తయారీ ఎక్స్‌పర్ట్‌ డానిష్‌ ఉన్నాడు. భారీ టెర్రర్‌ మాడ్యుల్‌ను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు.

దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్‌ చేసింది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. టెర్రరిస్టుల నుంచి భారీగా తుపాకీలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ముంబైకి చెందిన అఫ్తాబ్, అబు సుఫియాన్‌లను ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. ఆషర్ డానిష్‌ను రాంచీలో, కమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో, హుజైఫ్ యెమెన్‌ను తెలంగాణలో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని తమ హ్యాండ్లర్లతో సోషల్ మీడియా ద్వారా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement