ఎమ్మెల్యేపై దళితుల ఫిర్యాదు

Dalit People Complaint Against TDP MLA Jyothula Nehru - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లో రాజుపాలెం గ్రామ దళితులు ఫిర్యాదు చేశారు. గురువారం రాజుపాలెం గ్రామంలో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్యే తమను అవమానించారని, తమ మనోభావాలను కించపరిచేలా దూషించారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. జన్మభూమి సభలో భాగంగా తమ గ్రామంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరినందుకు.. పోలీసులకు తమను సభ నుంచి గెంటేయాలని ఎమ్మెల్యే సూచించారని వారు మండిపడ్డారు.

దళితులమనే చిన్న చూపుతోనే ఎమ్మెల్యే నెహ్రూ తన అగ్రకుల అహంకారం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని రాజుపాలెం దళితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభల్లో టీడీపీ ప్రభుత్వ తీరుపట్ల నిరసన గళాలు వినిపిస్తునే ఉన్నాయి. సమస్యలపై ప్రశ్నించిన వారిని అడుగడుగునా టీడీపీ నాయకులు ఇబ్బందులకు, అవమానాలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top