ముగ్గురు పిల్లలతో నీళ్లులేని బావిలో దూకిన జంట..

Couple With 3 Kids Committed Suicide Attempt - Sakshi

సాక్షి, నెల్లూరు: కుటుంబ సమస్యల కారణంగా ఓ జంట ముగ్గురు పిల్లలతో కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టాలని చూసింది. కలిసికట్టుగా బాలిలోకి దూకి.. మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే, విధి మరోవిధంగా తలిచింది. వారు దూకిన బావిలో నీళ్లు లేవు. దీంతో దంపతులతో సహా వారి ముగ్గురు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకునేందుకు ముగ్గురు పిలలతో కలిసి దంపతులు బావిలో దూకారు. అయితే, బావిలో నీళ్లు లేకపోవడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top