తల్లిదండ్రులతో ప్రయాణం.. ఇంతలో.. | China Manja Slits Childs Throat In Delhi | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులతో ప్రయాణం.. ఇంతలో..

Aug 25 2019 6:29 PM | Updated on Aug 25 2019 8:31 PM

China Manja Slits Childs Throat In Delhi - Sakshi

అది గమనించని ఆమె తండ్రి వాహనాన్ని ముందుకు పొనివ్వటంతో..

న్యూఢిల్లీ : చైనా మాంజా ఓ కుటుంబంలో విషాదం మిగిల్చింది. మాంజా కారణంగా ఓ చిన్నారి మృత్యువాత పడింది. ఈ సంఘటన శనివారం న్యూఢిల్లీలోని ఖజుర్‌ ఖాస్‌ ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇషికా అనే నాలుగున్నర సంవత్సరాల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి హనుమాన్‌ గుడికి వెళ్లటానికి బైక్‌పై ప్రయాణిస్తోంది. తండ్రి బైక్‌ నడుపుతుండగా చిన్నారి అతడి ముందు కూర్చుని ఉంది. బైక్‌ ఖజుర్‌ ఖాస్‌ ఏరియాకు చేరుకోగానే గాల్లోంచి ఎగిరివచ్చిన చైనా మాంజా ఇషిక మెడకు చుట్టుకుంది.

అది గమనించని ఆమె తండ్రి వాహనాన్ని ముందుకు పొనివ్వటంతో మాంజా పాప గొంతును కొసేసింది. ఇషిక ఒక్కసారిగా కేకవేయటంతో తల్లిదండ్రులు మెడకు చుట్టుకున్న మాంజాను గుర్తించారు. ఆ వెంటనే రక్తమోడుతున్న పాపను పవేశ్‌ చంద్రన్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకురావటానికి ముందే చిన్నారి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   

Advertisement
 
Advertisement
Advertisement