అదే నంబర్‌ రవికి ఎలా వచ్చింది ?

CCB Police Question To MB Patil In Rowdy Cycle Ravi Case - Sakshi

రౌడీ రవి ఎవరో నాకు తెలీదు : మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌

యశవంతపుర :  ప్రముఖ రౌడీ, సైకిల్‌ రవితో ప్రముఖు సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణలో మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌కు సంబంధాలు ఉన్నట్లు వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా పనిచేసిన ఎంబీ పాటిల్‌కు సంబంధాలు ఉన్నట్లు సీసీబీ పోలీసుల విచారణలో బయటపడింది. ఎంబీ పాటిల్‌ మంత్రిగా ఉన్నప్పుడే రౌడీ రవినే మంత్రికి 24 సార్లు ఫోన్‌ చేసినట్లు పోలీసుల వద్ద ఆధారాలు లభించాయి. ఈ సందర్భంగా నిందితుడు ఉపయోగించిన 11 ఫోన్లతో పాటు 38 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక సిమ్‌ నంబర్‌ ద్వారా మాత్రమే ఎంబీ పాటిల్‌కు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. రవి ఉపయోగించిన సిమ్‌కార్డు మండ్యకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు సచ్చిదానంద పేరుతో ఉంది. అదే నంబర్‌ రవికి ఏలా వచ్చిందో పోలీసులకు అర్థం కావటంలేదు. 2009 నుండి తానే ఉపయోగిస్తున్నట్లు సచ్చిదానంద చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అదే నంబర్‌ను రవి ఉపయోగించి ఉండవచ్చని సీసీబీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో విచారణ చేపట్టారు. ఇదే సమయంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టనుండటంతో అటు రాజకీయ నాయకుల్లో, ఇటు చిత్ర రంగ ప్రముఖల్లో భయం నెలకొంది.

రవి ఎవరో నాకు తెలియదు : మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌
రవి ఏవరో తనకు తెలిదని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు ఎంబీ పాటిల్‌ స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో వెల్లడించిన నెంబర్‌ తనదేనని, తన వాట్సాప్‌ నెంబర్‌ కూడా అదేనన్నారు. అయితే రవి అనే వ్యక్తితో తనకు ఎప్పుడు పరిచయం లేదని, అతడిని ఒక్కసారి కూడా చూడలేదన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top