హీరో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు

Case File Against Hero Raj Tarun on Car Accident - Sakshi

రాజేంద్రనగర్‌: నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. యువ నటుడు రాజ్‌తరుణ్‌ ట్విటర్‌ ద్వారా అల్కాపూరిలో జరిగిన సంఘటనపై స్పందించడంతో ఈ మిస్టరీ వీడింది. వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు అతను ట్విటర్‌లో పేర్కొనడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రమణగౌడ్‌ మాట్లాడుతూ హీరో రాజ్‌తరణ్‌ ట్విటర్‌ ద్వారా స్పందించడంతో అతడికి నోటీసులు అందించి విచారించనున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top