ఇద్దరు వీఆర్‌ఏలపై గొడ్డలితో దాడి: ఒకరి మృతి | attack on village revenue officers | Sakshi
Sakshi News home page

ఇద్దరు వీఆర్‌ఏలపై గొడ్డలితో దాడి: ఒకరి మృతి

Jan 12 2018 2:15 PM | Updated on Jan 12 2018 2:16 PM

attack on village revenue officers - Sakshi

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

సాక్షి, భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కాటారం శివారులో శుక్రవారం ఇద్దరు వీఆర్‌ఏలపై దాడి జరిగింది. కాటారం వద్ద నుంచి వెళ్తున్న రాములు, మరో వీఆర్‌ఏలపై నివాస్‌ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. భూ వివాదాల కారణంతోనే దాడి జరిగిందని స్థానికులు అంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థిలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement