దయ్యం పట్టింది.. మంత్రాలతో వదిలిస్తా.. | Abuse On Married Woman In Krishna | Sakshi
Sakshi News home page

దయ్యం పట్టింది.. మంత్రాలతో వదిలిస్తా..

Jan 28 2019 8:57 PM | Updated on Jan 28 2019 9:31 PM

Abuse On Married Woman In Krishna - Sakshi

దీంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. అనంతరం బాధితురాలు..

సాక్షి, కృష్ణా : మంత్రాల ముసుగులో మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో భూతవైద్యుడు. ఈ సంఘటన కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జగ్గయ్యపేటకు చెందిన దంపతులు అనారోగ్య సమస్యల కారణంగా అదే ప్రాంతంలోని తాయెత్తు సాయిబు దగ్గరకు వెళ్లారు. వివాహితకు దెయ్యం పట్టిందని, మంత్రాలతో దానిని వదిలిస్తానని సాయిబు వారిని నమ్మించాడు. మహిళ భర్తను గది బయటకు పంపి మంత్రాలు చదువుతూ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.

దీంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. అనంతరం బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో సాయిబుపై ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement