నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Four Killed In Road Accident In Nizamabad District | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న కారు: నలుగురు మృతి

Nov 17 2019 7:47 PM | Updated on Nov 17 2019 8:30 PM

Three Killed In Road Accident In Nizamabad District - Sakshi

సాక్షి, ఎడపల్లి: నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొనడంతో  ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఎడపల్లి మండలం అలీసాగర్‌ వద్ద జరిగింది. మృతులను జానకంపేట్‌ వాసులుగా గుర్తించారు. మృతులలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు జక్కం గంగామణి, నాగమణి, కల్లెపురం సాయి, ఆటో డ్రైవర్‌ ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement