కాబూల్‌లో పేలుడు..ఏడుగురి మృతి | 7 killed in Kabul market blast | Sakshi
Sakshi News home page

కాబూల్‌లో పేలుడు..ఏడుగురి మృతి

Dec 8 2017 6:44 PM | Updated on Dec 8 2017 6:44 PM

ఆఫ్ఘనిస్తాన్‌ : కాబూల్‌ నగరంలోని సర్‌-ఇ- కారెజ్‌ మార్కెట్‌లో శుక్రవారం మధ్యాహ్నాం జరిగిన పేలుడులో ఏడుగురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు. ఎవరిని లక్ష్యంగా దాడి చేశారో ఇంత వరకూ తెలియరాలేదు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఈ ఘటనలో మూడు వాహనాలు, చాలా దుకాణాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. గత నెల నవంబర్‌ 16న భద్రతా బలగాలను లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఎనిమిది పోలీసులతో కలిపి 15 మంది చనిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement