డాన్స్‌ బార్‌లో15 మంది అరెస్ట్‌

15 Arrested By Mumbai Police In Raid At Dance Bar - Sakshi

ముంబై : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ డాన్స్‌ బార్‌పై ముంబై పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో సహా 15 మందిని అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతో దక్షిణ  ముంబైలోని కొలాబాలో ఉన్న డాన్స్‌ బార్‌పై బుధవారం రాత్రి పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహిం‍చారు. హోటల్‌ యానమాన్యానికి చెందిన 9మంది, ఆరుగురు కస్టమర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో వ్యాపావేత్తలు, ప్రభుత్వ అధికారులు, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు. బార్‌లోని మహిళా సిబ్బందిని వదిలేశామని పోలీసులు చెప్పారు. నిందితులను కోర్టు ముందు హాజరపరచి, బెయిల్‌పై విడుదల చేశామని సీనియర్‌ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top