-
ట్రాప్ చేసి.. బార్ ఎదుట 30 సార్లు పొడిచి
థానే: మహిళను ఎరగా వేసి.. ఆపై బార్‌కు రప్పించి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని ఓ బార్లో మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దీపక్ బోయిర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మనేర్ గ్రామంలో నివసిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం దీపక్, నరేశ్ చావన్ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. ఓ మహిళ విషయంలో వారిద్దరూ పోట్లాటకు దిగారు. ఇది మనసులో పెట్టుకున్న చావన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం అతన్ని బార్‌కు రప్పించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగా ఓ మహిళ పేరుతో దీపక్‌కు కాల్ చేసి బార్‌కు రావాలని కోరాడు. ట్రాప్ చేసి బార్‌కు రప్పించి.. దీంతో ట్రాప్‌లో చిక్కుకున్న దీపక్, అతని స్నేహితుడిని తీసుకుని మంగళవారం ఉదయం 1.30కు స్థానిక డ్యాన్స్ బార్‌కు వెళ్లాడు. అనంతరం కాసేపటికే బార్ బయటికి వచ్చాడు. అయితే అక్కడే కాచుకుని ఉన్న చావన్, ఐదుగురు అనుచరులతో కలిసి వారిని చుట్టుముట్టారు. కత్తులు, తుపాకీలు తీసి వారిపై దాడికి యత్నించారు. దీంతో దీపక్, అతని స్నేహితుడు వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు అందుకున్నారు. కానీ దీపక్ మధ్యలో జారి కింద పడటంతో దుండగులు దీపక్‌పై కత్తితో దాడి చేశారు. చాతీ, పొట్ట, వీపు ప్రాంతాల్లో 30 సార్లు కిరాతకంగా పొడిచి చంపారు. పాత కక్షలతోనే హత్య! ఈ విషయాన్ని దీపక్ స్నేహితుడు, అతని కుటుంబ సభ్యులకు చేరవేయగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీపక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అవడంతో, దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే చావన్.. దీపక్‌ను హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు దొరికిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
డాన్స్ బార్లో15 మంది అరెస్ట్.. అంతా ఉన్నతాధికారులే!
ముంబై : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ డాన్స్ బార్‌పై ముంబై పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న డాన్స్ బార్‌పై బుధవారం రాత్రి పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్ యానమాన్యానికి చెందిన 9మంది, ఆరుగురు కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో వ్యాపావేత్తలు, ప్రభుత్వ అధికారులు, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు. బార్‌లోని మహిళా సిబ్బందిని వదిలేశామని పోలీసులు చెప్పారు. నిందితులను కోర్టు ముందు హాజరపరచి, బెయిల్‌పై విడుదల చేశామని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. -
ధిక్కరించే అవకాశాల గని... నిషేధం
సందర్భం చాలా కాలం క్రితం మధుర్ భండార్కర్ తీసిన ‘చాందినీ బార్’ సినిమాలో ఈ డ్యాన్స్ బార్ల పనితీరును దాదాపుగా మీరు చూసి ఉంటారు. అనేక ఒత్తిళ్ల కారణంగా అలాంటి బార్లలోనే మగ్గుతున్న నిస్సహాయ బాలికలు, డ్యాన్స్ నుంచి నిశ్శబ్దంగా వారు వ్యభిచారంలోకి జారిపోవడం, ఒక్కోసారి వాళ్లే ఆ బార్ల యజమానులుగా మారటం మనందరికీ తెలిసిన విషయమే. ఇది ముంబైకే సంబంధించిన ప్రత్యేకమైన విషయం. అది దాని కస్టమర్లు ఏమాత్రం డ్యాన్స్ చేయనటువంటి డ్యాన్స్ బార్. అది తాగుబోతు మహిళలు సైతం రావడానికి ఇష్టపడని లేడీస్ బార్. అలా గని అనేక మధ్య శ్రేణి ధరలతో కూడిన బార్ల కంటే అధిక ధరల వద్ద లిక్కర్‌ను అమ్మే ప్రత్యేకమైన విక్రయ కేంద్రం కూడా కాదు. అసలు విషయం ఏమిటంటే, అమ్మాయి లు డ్యాన్స్ ఫ్లోర్‌ను ఆక్రమించి డ్యాన్స్ చేస్తుంటే కస్టమ ర్లు వారివద్దకు వచ్చి కరెన్సీనోట్లను వారిపై విసురుతుం టారు. అక్కడున్న డ్యాన్సర్లో ఒకరు ఏ కస్టమర్ సీటువ ద్దకైనా రావడానికి ఇష్టపడితే, అతడు ఆమెను పక్కన కూర్చుండబెట్టుకుంటాడు. డ్యాన్స్ బార్లను నిషేధిస్తూ మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టంపై ప్రస్తుతం సుప్రీం కోర్టు తాత్కాలికంగా స్టే విధించిన నేపథ్యంలో ఇలాంటి దృశ్యాలు ముంబై సాంస్కృతిక రంగంమీదికి తిరిగి రానున్నాయా? సంపాదనాపరుడు తన కుటుంబాన్ని పట్టించుకోవడం మాని డ్యాన్స్ బార్లలో నాట్యగత్తెలపై కరెన్సీ నోట్లను విసిరేయడానికే ప్రాధాన్యమిస్తున్నందున కుటుంబ జీవితం సర్వనాశనం అవుతోందని గుర్తించిన నాటి ఎన్సీపీ హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ దశాబ్దం క్రితం డ్యాన్స్ బార్లపై నిషేధం విధించారు. ప్రభుత్వం ఇలా నిషేధం విధించడానికి ఆ బార్ల లోకి చట్టవిరుద్ధంగా వెల్లువెత్తుతున్న డబ్బు కూడా మరో కారణమైంది. అమ్మాయిలను ఆ బార్లలోకి అనుమతిం చాక, వాటి యజమానులు అక్కడేం జరిగినా బాధ్యత వహించరు. డబ్బుకు తప్ప మరి దేనికీ ప్రాధాన్యమివ్వని నిఘా పోలీసులూ పట్టించుకోరు. అత్యంత అల్పస్థాయి జీవితాలు గడుపుతున్నవారే అక్కడికి వస్తుంటారని బార్ యజమాని స్వయంగా నాకు తెలిపాడు. అంతమంది అక్కడ గుమికూడటం ద్వారా నేరాలు జరిగే అవకాశం ఉన్నా బార్ యజమానులు పట్టించుకోరు. కోట్లాది రూపాయత వ్యాపారం నడిచే ఈ బార్లకు సంబంధిం చిన సరైన అంచనాలు లభ్యం కావు. చాలా కాలం క్రితం మధుర్ భండార్కర్ తీసిన చాందినీ బార్ సినిమాలో ఈ డ్యాన్స్ బార్ల పనితీరును దాదాపుగా మీరు చూసి ఉంటారు. అనేక ఒత్తిళ్ల కారణం గా అలాంటి బార్లలోనే మగ్గుతున్న నిస్సహాయ బాలి కలు, డ్యాన్స్ నుంచి నిశ్శబ్దంగా వారు వ్యభిచారంలోకి జారిపోవడం, ఒక్కోసారి వాళ్లే ఆ బార్ల యజమాను లుగా మారటం మనందరికీ తెలిసిన విషయమే. ఒక్క సారిగా వీటిని నిషేధించడంతో వాటిపై ఆధారపడి బతుకుతున్న లక్షమందికిపైగా వ్యక్తులు వీధినపడ్డారు. దీంతో పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. మరోవైపు బార్లను పునరుద్ధరించుకోవడానికి వాటి యజమానులు ఎడతెగని పోరాటం చేస్తూనే వచ్చారు. గత గురువారం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ డ్యాన్స్ బార్లపై విధించిన సవరణ చట్టంపై సుప్రీంకోర్టు తాత్కా లిక స్టే విధించింది. అంతిమంగా వాటిపై ప్రభుత్వ అభి ప్రాయం తెలుపవలసిందిగా కోరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డ్యాన్స్ బార్లను క్రమబద్ధీకరించడం కంటే వాటిపై సంపూర్ణ నిషేధాన్నే కోరుకుంటున్నట్లు ప్రకటిం చారు. పోలీసు కేసు డైరీలు చెబుతున్నట్లుగా అక్కడ అశ్లీల ఘటనలు చాలా జరుగుతున్నందునే సీఎం ఇలా ప్రకటించి ఉంటారేమో కానీ, అదే కారణం కాకపో వచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం డ్యాన్స్ బార్లపై విధించిన నిషేధంపై ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదనే విషయం బట్టబయలు అవుతుందనే కారణంతోనే సీఎం అలా స్పందించి ఉండవచ్చు. ఒక సంవత్సర కాలంగా ఈ అంశంపై తన వైఖరిని ప్రభుత్వం స్పష్టం చేయలేదు. జనంలో వ్యాపింపజేసిన అభిప్రాయం కూడా డ్యాన్స్ బార్లు మళ్లీ రావచ్చు అనే సూచించింది. ఇది ఒక కేసే కాదు అన్న చందాన ప్రభు త్వం ఎంత సోమరితనంతో, నిర్లక్ష్యంతో వ్యవహరించిం దనడానికి దీనికి మించిన వివరణ అవసరం లేదు. ఇక్కడే మనకు గుణపాఠాలు ఎదురవుతాయి. ప్రభుత్వం బయటకు చెప్పే మాటల్ని వేటినీ ఆమోదించవద్దు. ప్రభుత్వాధినేతల పెదవుల పైన తారాడే మాటలను జాగ్రత్తగా చదివి ఆ తర్వాతే తెరవెనుక ఏం జరుగుతోందని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే 2005లో డ్యాన్స్ బార్లపై నిషేధం తర్వాత అలాంటి కార్యకలాపాలు మహారాష్ట్రలో ఉనికిలో లేకుం డా పోయాయని భావించరాదు. ఎందుకంటే ఏ నిషేధం కూడా పూర్తి ఫలితాలనివ్వదు. చట్టాలను అమలు చేసే వారి సహకారంతో ధిక్కరించడానికి అవకాశాలు కల్పిం చేదే నిషేధమని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు గుట్కా తీసుకోండి. నిషేధం ఉన్నా ఇది ఎక్కడైనా దొరు కుతుంది. గుజరాత్ లేక వార్ధాలో లిక్కర్ కూడా ఇంతే. డ్యాన్స్ బార్ల విషయంలో వాటి నిర్వాహకులు కొని క్రమబద్ధీకరణలను కనిపెట్టారు. అవును మరి. మూడు లేదా అంతకంటే ఎక్కువ నక్షత్రాల హోటళ్లలో ఈ డ్యా న్స్ బార్లను కొనసాగించారు. ప్రారంభంలో క్లయిం ట్‌కు, డ్యాన్సర్‌కు మధ్య కాంటాక్ట్ లేకుండా ఆంక్ష విధిం చి ఉండవచ్చు. తర్వాత ఆర్కెస్ట్రా బార్లు వచ్చాయి. ఇక్కడ సంగీతకారులు పాటలను వినిపించవచ్చు కానీ అధికారికంగా అమ్మాయిలు డ్యాన్స్ చేయరు. కానీ కొంతమంది అమ్మాయిలను ఇక్కడ వెయిటర్లుగా అను మతిస్తారు. గతంలో వలే కాకుండా పోలీసు వ్యాన్ వెలుపల ఉంటూండగానే అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఈ బార్లను నడపటం అలవాటు చేసుకున్నారు. అయితే ముంబైవాసులకు పదేళ్లుగా డ్యాన్స్ బార్ల ను నిషేధించిన చోటే ఆర్కెస్ట్రా బార్లు అదేరకమైన సేవలను అందిస్తూ కొనసాగాయి. కొన్నింటిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించారు. పోలీసులు బలవం తంగా లోపలికి జొరబడినా వారికి తెలియకుండా వ్యవ హరించే పద్ధతులను బార్ల యజమానులు కనిపెట్టారు. సర్వసాధారణంగా వారు తమ కస్టమర్లను రహస్య ప్రాం తాల్లో దాచి ఉంచేవారు. గోడల మధ్య సందుల్లో కనిపిం చకుండా దాచేవారు. చివరకు బార్ అడుగుభాగంలో కూడా అమ్మాయిలు దాక్కునేవారు. అయితే ఇలాంటి పద్ధతులు బార్ల యజమానులకు పెద్దగా ఉపయోగ పడిందీ లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలలో ఇలాంటి 400 కేసులను పోలీసులు పట్టుకున్నారు మరి. మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు), ఈమెయిల్: (mvijapurkar@gmail.com)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement