ఆర్మీ ర్యాలీకి వెళ్ళొస్తూ.. పదిమంది మృతి | 10 men Died In Haryana Road Accident | Sakshi
Sakshi News home page

హర్యానాలో రోడ్డు ప్రమాదం; పదిమంది మృతి

Sep 25 2019 12:08 PM | Updated on Sep 25 2019 12:58 PM

10 men Died In Haryana Road Accident - Sakshi

చండీగఢ్ : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది యువకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ విషాద ఘటన రాష్ట్రంలోని జింద్‌-హన్సీ సమీప ప్రాంతాల్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొని తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తుండగా రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో వెళ్తున్న వారిని వెనక నుంచి వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ప్రమాద స్థలంలోనే పది మంది మృత్యువాత పడగా,  ఒకరు గాయాలతో బయటపడ్డారు. అనంతరం గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వద్ద ఉన్న పత్రాల ఆధారంగా తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మరణించిన పది మందిలో అయిదుగురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement