'నా భర్తతో చాట్‌ చేస్తుంటే దావూద్‌ ఫోన్‌ చేశాడు' | Dawood' calls Anjali Damania | Sakshi
Sakshi News home page

'నా భర్తతో చాట్‌ చేస్తుంటే దావూద్‌ ఫోన్‌ చేశాడు'

Sep 23 2017 3:06 PM | Updated on Sep 23 2017 6:11 PM

Dawood' calls Anjali Damania

అంజలి దమానియా (ఫైల్‌ ఫొటో)

ముంబయి : ప్రముఖ ఉద్యమకారురాలు అంజలి దమానియాకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. అండర్‌ వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తనకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నాడంటూ ఆమె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సేపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరిస్తున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

'నేను నా భర్తతో చాటింగ్‌ చేస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట నాకు ఓ ఫోన్‌ వచ్చింది. ట్రూకాలర్‌ ద్వారా ఆ నెంబర్‌ దావూద్‌ది అని తెలిసింది. పాకిస్థాన్‌ నెంబర్‌ నుంచే ఆ ఫోన్‌ వచ్చింది. తన ఫోన్‌లో దావూద్‌ 2 అని కనిపించింది. ఈ విషయాన్ని నేను ముంబయి కమిషనర్‌కు ఫిర్యాదు కూడా చేశాను. ఆయన తగిన చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు' అని తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా రెండు స్క్రీన్‌ షాట్‌లు కూడా పంపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement