విప్రో ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Wipro offers high singledigit pay hike to staff  - Sakshi

ఉద్యోగులకు వేతనాలు పెంపు 

డిజిటల్‌ రంగ ఉద్యోగులకు  స్పెషల్‌ ఇంక్రిమెంట్స్‌

ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులకు  కూడా ప్రోత్సాహకాలు

సాక్షి, ముంబై : సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రో ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు  వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డిజిటల్‌  రంగంలోని ఉద్యోగులకు భారీగా  ‍స్పెషల్‌ ఇంక్రిమెంట్స్‌ ఇచ్చింది.  వీరితోపాటు కొత్తగా చేరిన ఉద్యోగులకు కూడా  ప్రోత్సాహక రివార్డులను ప్రకటించడం విశేషం.

బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రో జూనియర్ లెవల్ ఉద్యోగుల  నుంచి అయిదేళ్ల అనుభవం కలిగిన ఉద్యోగులకు  వేతనాలను పెంచింది.  ముఖ్యంగా మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి డిజిటల్ టెక్నాలజీలో పని చేస్తోన్న ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ప్రకటించింది.  ఇండియాలోని ఆఫ్‌షోర్ ఉద్యోగులు, ఆన్‌లైన్‌ ఉద్యోగులు, అమెరికా, యూరోప్‌లలోని ఉద్యోగులకు వేతనాలను 6 శాతం -8 శాతం మధ్య పెంచింది.   సవరించిన జీతాలు జూన్ 1వ తేదీ నుంచి అమలు చేయనుంది. సగటున ఆఫ్‌షోర్ ఉద్యోగులకు హైసింగిల్ డిజిట్ ఇంక్రిమెంట్స్, ఆన్‌సైట్ ఉద్యోగులకు లో నుంచి మిడిల్ సింగిల్ డిజిట్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ట్రాన్స్‌ఫర్మేటివ్,  ఫ్యూచర్ ఓరియెంటెడ్ టెక్నాలజీపై పని చేస్తున్న ప్రారంభ ఉద్యోగులకు ప్రోత్సహకంగా  ప్రత్యేకమైన ఇన్సెంటివ్‌లు, రివార్డులు ఇవ్వనుంది. 

కాగా  విప్రోలో మార్చి 31, 2019 నాటికి 1.7 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎక్కువగా 1 నుండి 5 ఏళ్ల అనుభవం కలిగిన వారు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో విప్రో క్యాంపస్ సెలక్షన్ ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ ప్రకటించింది. విప్రో వ్యవస్థాపక ఛైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ రిటైర్‌మెంట్‌ ప్రకటించగా, ఆయన స్థానంలో వారసుడు  రిషద్‌ ప్రేమ్‌ జీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా జూలై 31 నుంచి బాధ్యతలను తీసుకోనున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top