షాకింగ్‌ : నిమిషానికి ఆరు పైసలా?! | Vodafone Idea Seeks Rs. 35 per GB as Minimum Mobile Data Tariff Amid Financial Woes | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : నిమిషానికి ఆరు పైసలా?!

Feb 29 2020 8:32 AM | Updated on Feb 29 2020 8:44 AM

Vodafone Idea Seeks Rs. 35 per GB as Minimum Mobile Data Tariff Amid Financial Woes - Sakshi

సాక్షి, ముంబై: అష్టకష్టాలతో దివాలా దిశగా పయనిస్తున్న టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా సంచలన ప్రతిపాదనలు చేసింది. ఆర్థికంగా భారీ నష్టాలకు తోడు ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు వివాదంతో మరింత కుదేలైన సంస్థ మొబైల్‌ డేటా, కాల్‌ చార్జీలపై కొన్ని సవరణలు చేయాలని కోరుతోంది.  డేటా చార్జీలను కనీసం 7 రెట్లు , కాల్‌ చార్జీలను  8 రెట్లు పెంచాలని కోరుతోంది. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది.  దీంతో  వొడాఫోన్ ఐడియా  వినియోగదారులు షాక్‌ తిన్నారు.

మొబైల్ డేటా  చార్జీని ఒక జీబీకి రూ. 35 వుండాలని,( ప్రస్తుతం జీబీకి రూ. 4-5) అవుట్‌ గోయింగ్‌ కాలింగ్‌ చార్జి నిమిషానికి 6 పైసలుగా( మంత్లీ చార్జీ కాక) నిర్ణయించాలని డాట్‌కు రాసిన లేఖలో వొడాఫోన్‌ ఐడియా కోరింది. దీంతోపాటు కనీస నెలవారీ కనెక్షన్ ఛార్జీ రూ. 50లుగా ఉంచాలని  ప్రతిపాదించింది. ఏజీఆర్‌ బకాయిలు చెల్లించేందుకు సహాయపడటానికి ఏప్రిల్ 1 నుంచి ప్రతిపాదిత  రేట్లను అమలు చేయాలని కోరుతోంది. మార్కెట్ వాటా తగ్గడం మరియు ప్రభుత్వానికి ఎజిఆర్ బకాయిలు చెల్లించడం వల్ల కంపెనీ గత కొన్ని వారాలలో భారీ నష్టాలతో సహా ఆర్థిక ఇబ్బందులను వెల్లడించింది.

కాగా ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి వోడాఫోన్‌ ఐడియా ప్రభుత్వం చెల్లించాల్సింది. మొత్తం రూ. 53,000 కోట్లు. ఈ బకాయిల్లో కంపెనీ ఇప్పటికే రూ 3500 కోట్లు చెల్లించగా, స్వయం మదింపు ఆధారంగా రూ 23,000 కోట్లు ఇంకా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ 7000 కోట్లు అసలు మొత్తం. మరోవైపు బకాయిల చెల్లింపునకు మూడేళ్ల మారటోరియం గడవు ఇవ్వాలని, బకాయిలు చెల్లించడానికి 18 సంవత్సరాల సమయం కోరినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, జియో కూడా టారిఫ్‌లను పెంచిన సంగతి తెలిసిందే.

 చదవండి : చార్జీల వడ్డన: జియోకు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement