రెండేళ్లలో రెట్టింపునకు ‘సిప్‌’ పెట్టుబడులు | Systematic Investment Plan | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో రెట్టింపునకు ‘సిప్‌’ పెట్టుబడులు

Jun 26 2017 12:26 AM | Updated on Sep 5 2017 2:27 PM

రెండేళ్లలో రెట్టింపునకు ‘సిప్‌’ పెట్టుబడులు

రెండేళ్లలో రెట్టింపునకు ‘సిప్‌’ పెట్టుబడులు

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో వచ్చే రెండళ్లలో ఈ పెట్టుబడులు ప్రస్తుత

ప్రస్తుతం నెలవారీ పెట్టుబడులు రూ.4,580 కోట్లు
గత మూడేళ్లలో మూడు రెట్ల వృద్ధి


ముంబై: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో వచ్చే రెండళ్లలో ఈ పెట్టుబడులు ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపు అవుతాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేర్కొంది. వాస్తవానికి గత మూడేళ్ల కాలంలో సిప్‌ల్లో నెలవారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మూడు రెట్లు వృద్ధి చెంది ఈ ఏడాది మే నెలలో రూ.4,580 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఈ సంస్థ నివేదిక ప్రకారం ఇది ఈ స్థాయి నుంచి రెట్టింపు కానుంది. 42 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కలసి 1.4 కోట్లకుపైగా సిప్‌ ఖాతాలను నిర్వహిస్తుండగా... ఈ ఏడాది ఒక్క మే నెలలోనే కొత్తగా 5 లక్షల సిప్‌ ఫోలియోలు పెరిగాయి.

‘‘2014 మార్చిలో సిప్‌ ద్వారా వచ్చిన పెట్టుబడుల విలువ రూ.1,206 కోట్లు. ఇది 2017 మార్చి నెలలో రూ.3,989 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో యాక్టివ్‌ సిప్‌ ఖాతాల సంఖ్య 51.96 లక్షల నుంచి 1.4 కోట్లకు పెరిగింది’’ అని జియోజిత్‌ నివేదిక వెల్లడించింది. వచ్చే రెండేళ్లలో నెలవారీగా సిప్‌ రూపంలో వచ్చే పెట్టుబడులు రూ.10,000 కోట్ల స్థాయిని చేరుతుందనేది ఈ సంస్థ అంచనా. ‘‘సిప్‌ ద్వారా ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. గడిచిన ఏడాదిలో సిప్‌ ఫోలియోల్లో అనూహ్య పెరుగుదల ఉంది. వచ్చే కొన్నేళ్లలో ఇది ఇంకా జోరందుకుంటుంది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ అసిసోయేట్‌ డైరెక్టర్‌ రంజిత్‌ ఆర్జీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement