
న్యూఢిల్లీ: ప్రముఖ టూవీలర్ కంపెనీ ‘సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా’ తాజాగా 2018 ఎడిషన్ జిక్సర్, జిక్సర్ ఎస్‌ఎఫ్ బైక్స్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.80,928, రూ.90,037గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. రెండింటిలోనూ సుజుకీ ఎకో పర్ఫార్మెన్స్ టెక్నాలజీతో కూడిన 155 సీసీ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.