బలపడిన రూపాయి | Rupee strengthens by 11 paise to 64.91 | Sakshi
Sakshi News home page

బలపడిన రూపాయి

Oct 24 2017 10:44 AM | Updated on Oct 24 2017 5:25 PM

Rupee strengthens by 11 paise to 64.91



సాక్షి, ముంబై:  డాలర్‌తో పోల్చుకుంటే  దేశీయ కరెన్సీ    రూపాయి బలపడింది. వరుస నష్టాలకు చెక్‌ చెప్పి లాభాల్లో కొనసాగుతోంది.  ప్రపంచ కరెన్సీలతో డాలర్‌ వీక్‌ నెస్‌కారణంగా డాలర్‌మారకంలో రూపాయి 11పైసలు లాభపడింది.


దేశీయ ఈక్విటీ మార్కెటట్లో  ప్రారంభ లాభాలు రూపాయి విలువను ప్రభావితం చేశాయి. అమెరికా  సెంట్రల్‌ బ్యాంక్‌  తరువాత అధిపతి ఎవరుండనున్నారనే సందిగ‍్ధత నేపథ్యంలో  బ్యాంకులు, ఎగుమతిదారులు స్థానిక కరెన్సీతో పాటు,  అమెరికా కరెన్సీని విక్రయాలకు దిగడంతో రూపాయ రూ. 65 స్థాయిపైకి చేరింది.   సోమవారంనాటి  65.02 ముగింపుతో పోలిస్తే 64.91  వద్ద కొనసాగుతోంది.
 
అటు   పుత్తడి కూడా పాజిటివ్‌గా  ట్రేడ్‌అవుతోంది.   నిన్నటి నష్టాలను తగ్గించుకొని  లాభాల్లోకి మళ్లింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో  పది గ్రా. రూ.32 లాభంతో రూ. 29,569 వద్ద కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement