పీఎన్‌బీ సహా నాలుగు బ్యాంకులకు జరిమానా | RBI Fine Five Banks With PNB | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ సహా నాలుగు బ్యాంకులకు జరిమానా

Jul 3 2019 1:17 PM | Updated on Jul 3 2019 1:17 PM

RBI Fine Five Banks With PNB - Sakshi

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), యూకో బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులకు ఆర్‌బీఐ రూ.1.75 కోట్ల జరిమానాలు విధించింది. కేవైసీ అవసరాలు, కరెంటు ఖాతాల ప్రారంభానికి సంబంధించి నిబంధనలు పాటించకపోవడమే కారణం. పీఎన్‌బీ, అలహాబాద్‌ బ్యాంకు, యూకో బ్యాంకులకు ఒక్కో దానికి రూ.50 లక్షల చొప్పున, కార్పొరేషన్‌ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement