ఓయోరూమ్స్ తో పేపాల్ అవగాహన | OYO Rooms partners with PayPal for global transactions | Sakshi
Sakshi News home page

ఓయోరూమ్స్ తో పేపాల్ అవగాహన

Mar 12 2016 1:10 AM | Updated on Sep 3 2017 7:30 PM

ఓయోరూమ్స్ తో పేపాల్ అవగాహన

ఓయోరూమ్స్ తో పేపాల్ అవగాహన

భారత దేశపు అతిపెద్ద బ్రాండెడ్ నెట్‌వర్క్ హోటల్ సంస్థ ఓయో రూమ్స్‌తో ఒప్పందం

హైదరాబాద్: భారత దేశపు అతిపెద్ద బ్రాండెడ్ నెట్‌వర్క్ హోటల్ సంస్థ ఓయో రూమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని  అంతర్జాతీయ ఓపెన్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేపాల్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఈ కామర్స్ రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని, అదే విధంగా ఆన్‌లైన్ చెల్లింపుల్లో రిస్క్ కూడా బాగా పెరుగుతోందని పేపాల్  రీజనల్ మర్చెంట్ సర్వీసెస్ హెడ్ హమిశ్ మోలైన్ పేర్కొన్నారు. ఓయోరూమ్స్ వంటి సంస్థలకు చెల్లింపుల విషయంలో రిస్క్‌ను తగ్గించేలా టెక్నాలజీ సొల్యూషన్లను అందిస్తామని తెలిపారు. వినియోగదారుల చెల్లింపులు సులభంగా, ఎలాంటి రిస్క్‌లు లేకుండా ఉండేందుకు గాను పేపాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓయోరూమ్స్ సీఓఓ అభివన్ సిన్హా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement