ట్రంప్‌తో మాట్లాడా.. ఆవిధంగానే ఒప్పందం?: నెతన్యాహు | iran war benjamin netanyahu says spoke with donald trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌తో మాట్లాడా.. ఆవిధంగానే ఒప్పందం?: నెతన్యాహు

Mar 24 2026 4:27 AM | Updated on Mar 24 2026 4:59 AM

 iran war benjamin netanyahu says spoke with donald trump

ఇరాన్‌తో అమెరికా చర్చలు జరుపుతుందన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ట్రంప్‌తో తాను మాట్లాడానని ఎట్టి  పరిస్థితుల్లోనూ తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారు.  అదేవిధంగా  ఇరాన్‌పై తమ దాడులు కొనసాగుతూ ఉంటాయని ప్రకటించారు.

పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక అడుగు వెనుకకు వేసినా ఇజ్రాయెల్ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు తాజాగా బెంజిమిన్ నెతన్యాహు ఆ విధమైన వ్యాఖ్యలే చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను మాట్లాడినట్లు తెలిపారు. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు సాధించిన విజయాల ఆధారంగానే ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలిపారు.

అయితే  ఈ ఒప్పందం తప్పనిసరిగా ఇజ్రాయెల్ యొక్క  ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని పేర్కొన్నారు. ట్రంప్ సైతం ఈ విధంగానే ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. నెతన్యాహూ మాట్లాడుతూ "ఏ పరిస్థితిలోనైనా మా ప్రయోజనాలను మేము కాపాడుకుంటాం. అదే సమయంలో ఇరాన్ మరియు లెబనాన్‌లలో మా దాడులు కొనసాగుతూనే ఉంటాయి" అన్నారు.

ఇరాన్ అణు మరియు క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా, గత కొద్ది రోజుల్లోనే మరో ఇద్దరు ఇరాన్ అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టామని ది ఇక్కడితో ముగిసిపోదని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ స్పీకర్ సైతం అమెరికాతో చర్చలు జరగడం లేదని ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement