మోది ఏడాది పాలనలో రెండింతల రిటర్న్‌ల ఇచ్చిన 5 షేర్లు ఇవే...!

Modi 2.0: Five stocks more than doubled - Sakshi

మోదీ ఏడాది పాలనలో ఇన్వెస్టర్లు రూ.27లక్షల కోట్లను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 
ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ 2019 మార్చి30 నాడు రూ.154.43 లక్షల కోట్లుగా ఉంది. సరిగ్గా ఏడాది సమయానికి అంటే 2020 మార్చి 29 నాటికి రూ.127.06 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌, నిఫ్టీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే బేర్స్‌ దలాల్‌ స్ట్రీట్‌ను నియంత్రించడంతో సూచీలు కీలక మద్దతు స్థాయిల వైపు తిరిగివచ్చాయి.  
 
ఇదే ఏడాది కాలంలో 5 కంపెనీల షేర్లు మాత్రం రెట్టింపు ఆదాయాలు ఇన్వెస్టర్లకు ఇచ్చాయి. అబాట్‌ ఇండియా, నవీన్‌ ఫ్లోరిన్‌, ఆల్కేమ్‌ అమైన్స్ కెమికల్స్, జీఎంఎం ఫౌడ్లర్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ షేర్లు ఉన్నాయి.

అలాగే 20 కంపెనీ షేర్లు 50శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ధనుకా అగ్రిటెక్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, అస్ట్రాజెనికా ఫార్మా, ఇప్కా ల్యాబ్స్‌, దిక్సాన్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ కంపెనీ షేర్లు వీటిలో ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top