అంచనాలను మించిన ఎం అండ్‌ ఎం | M&M Q4 net profit rises 50percent to Rs 1,155 crore | Sakshi
Sakshi News home page

అంచనాలను మించిన ఎం అండ్‌ ఎం

May 29 2018 3:08 PM | Updated on May 29 2018 3:15 PM

M&M Q4 net profit rises 50percent to Rs 1,155 crore - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది.  గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో 50 శాతం వృద్ధితో  రూ. 1,155 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.  కాగా నికర లాభం 1,037 కోట్ల రూపాయలుగా ఉండనుందని   విశ్లేషకులు అంచనా  అంచనా వేశారు.  మొత్తం ఆదాయం  26 శాతం పెరిగి రూ. 13,189 కోట్లకు నమోదైంది. నిర్వహణ లాభం మరింత అధికంగా 70 శాతం ఎగసి రూ. 1995 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 15.1 శాతంగా నమోదుకాగా..  ఆటో విభాగం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9105 కోట్లకు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement