జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లాభం రూ. 400 కోట్లు | GMR Airports posts Rs 400 cr profit in Q4 Results | Sakshi
Sakshi News home page

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లాభం రూ. 400 కోట్లు

May 29 2026 4:06 AM | Updated on May 29 2026 4:06 AM

GMR Airports posts Rs 400 cr profit in Q4 Results

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) రూ.400 కోట్ల లాభం ప్రకటించింది. గత క్యూ4లో కంపెనీ రూ.253 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా క్యూ4లో ఆదాయం రూ. 2,977 కోట్ల నుంచి రూ.4043 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఏడాదికి గాను దశాబ్దకాలంలో తొలిసారి లాభాలు నమోదు చేసింది. 

రూ. 472 కోట్ల లాభం ప్రకటించింది. ఆదాయం రూ. 10,836 కోట్ల నుంచి రూ. 15,201 కోట్లకు ఎగిసింది. జీఏఎల్‌ హైదరాబాద్, ఢిల్లీ, గోవాలో విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. సవాళ్లు నెలకొన్నప్పటికీ తమ నిర్వహణలోని విమానాశ్రయాల్లో పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ, నాలుగో త్రైమాసికంలోనూ ప్యాసింజర్ల రద్దీ వరుసగా 12.16 కోట్లు, 3.17 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement