మారుతీ వేగన్-ఆర్.. లిమిటెడ్ ఎడిషన్ | Maruti Suzuki Wagon R Felicity Limited Edition Launched At Rs. 4.4 Lakh | Sakshi
Sakshi News home page

మారుతీ వేగన్-ఆర్.. లిమిటెడ్ ఎడిషన్

Nov 26 2016 12:45 AM | Updated on Sep 4 2017 9:06 PM

మారుతీ వేగన్-ఆర్.. లిమిటెడ్ ఎడిషన్

మారుతీ వేగన్-ఆర్.. లిమిటెడ్ ఎడిషన్

మారుతీ సుజుకీ కంపెనీ వేగన్‌ఆర్‌లో లిమిటెడ్ ఎడిషన్, వేగన్ ఆర్ ఫెలిసిటిను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది.

ధర రూ.4.4 లక్షలు- రూ.5.37 లక్షలు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ వేగన్‌ఆర్‌లో లిమిటెడ్ ఎడిషన్, వేగన్ ఆర్ ఫెలిసిటిను  శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. దర రూ.4.4 లక్షల నుంచి రూ.5.37 లక్షల రేంజ్‌లో ఉంటుందని కంపెనీ తెలిపింది. డిస్‌ప్లే, వారుుస్ గెడైన్‌‌సతో కూడిన రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, బాడీ గ్రాఫిక్స్, రియర్  స్పారుులర్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ ఈడీ (మార్కెటింగ్  అండ్ సేల్స్) ఆర్.కె. కల్సి చెప్పారు. భారత్‌లో అత్యధికంగా విజయం సాధించిన కార్ బ్రాండ్లలో వ్యాగన్ ఆర్  ఒకటని పేర్కొన్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే  ఈ కార్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయని వివరించారు. పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో మాన్యువల్ ట్రాన్సిమిషన్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ మోడళ్లలో లభిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement