breaking news
Wagon R
-
75 దేశాల్లో కోటి మంది కొన్నారు: ధర కూడా తక్కువే..
సుజుకి మోటార్ కార్పొరేషన్.. 'వ్యాగన్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా 1 కోటి అమ్మకాలు దాటిందని ప్రకటించింది. ఈ కారు 1999లో భారతదేశంలో అడుగుపెట్టడానికి ముందే.. జపాన్, యూరప్ వంటి మార్కెట్లలో మంచి అమ్మకాలను పొందింది.1993 సెప్టెంబర్‌లో జపాన్‌లో వ్యాగన్ ఆర్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది సెమీ బోనెట్ స్టైల్ పొందింది. దీని పరిమాణం, డిజైన్ కారణంగానే అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. జపాన్ తరువాత భారతదేశం (1999), హంగేరీ (2000), ఇండోనేషియా (2013), పాకిస్తాన్ (2014)లలో వ్యాగన్ ఆర్ ఉత్పత్తి మొదలైంది. ప్రస్తుతం ఈ కారును కంపెనీ సుమారు 75 కంటే ఎక్కువ దేశాల్లో విక్రయిస్తోంది.1998 అక్టోబర్ నాటికి 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్న వ్యాగన్ ఆర్.. 2010 ఫిబ్రవరి నాటికి 50 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. 2022 జనవరి నాటికి 90 లక్షలు, 2025 జూన్ నాటికి ఒక కోటి యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకోగలిగింది.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్: రూ.10 లక్షల తగ్గింపు!భారతదేశంలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 1.0 లీటర్, త్రీ సిలిండర్, 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో మాత్రమే కాకుండా.. CNG ఎంపికలో కూడా లభిస్తోంది. ఈ కారు ధరలు రూ. 5.78 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. -
మారుతీ వేగన్-ఆర్.. లిమిటెడ్ ఎడిషన్
ధర రూ.4.4 లక్షలు- రూ.5.37 లక్షలు న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ వేగన్ఆర్లో లిమిటెడ్ ఎడిషన్, వేగన్ ఆర్ ఫెలిసిటిను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. దర రూ.4.4 లక్షల నుంచి రూ.5.37 లక్షల రేంజ్లో ఉంటుందని కంపెనీ తెలిపింది. డిస్ప్లే, వారుుస్ గెడైన్సతో కూడిన రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, బాడీ గ్రాఫిక్స్, రియర్ స్పారుులర్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.కె. కల్సి చెప్పారు. భారత్‌లో అత్యధికంగా విజయం సాధించిన కార్ బ్రాండ్లలో వ్యాగన్ ఆర్ ఒకటని పేర్కొన్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ కార్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయని వివరించారు. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో మాన్యువల్ ట్రాన్సిమిషన్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ మోడళ్లలో లభిస్తుందని పేర్కొన్నారు. -
మారుతీ వ్యాగన్ఆర్ అవాన్సె
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ వ్యాగన్ఆర్లో లిమిటెడ్ ఎడిషన్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. అవాన్సె పేరుతో అందిస్తున్న ఈ కారు ధరలు రూ.4.30 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ తెలిపింది. మూడు నెలలు మాత్రమే విక్రయాలకు అందుబాటులో ఉండే ఈ అవాన్సెను రెండు వేరియంట్లలలో(ఎల్ఎక్స్ఐ పెట్రోల్, ఎల్ఎక్స్ఐ సీఎన్జీ) అందిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా హెడ్ (మార్కెటింగ్) వినయ్ పంత్ తెలిపారు. డబుల్ డిన్ స్టీరియో విత్ బ్లూటూత్, డ్యుయల్ టోన్ డాష్‌బోర్డ్, ప్రీమియం సీట్ ఫ్యాబ్రిక్, రియర్ పవర్విండోస్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. ఈ కొత్త లిమిటెడ్ వేరియంట్‌తో వ్యాగన్ఆర్ బ్రాండ్ మరింత శక్తివంతం అవుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
మారుతీ వేగన్ ఆర్ అమ్మకాలు @ 15 లక్షలు
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు 15 లక్షల అమ్మకాల మైలురాయిని సాధించింది. వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ మోడల్లో మార్పులు, చేర్పులు చేయడం, విజయవంతమైన మార్కెటింగ్ విధానాల ద్వారా ఈ ఘనతను సాధించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మనోహర్ భట్ చెప్పారు. ఈ మోడల్‌ను 2000 సంవత్సరంలో మార్కెట్లోకి తెచ్చామని, భారత్‌లో విక్రయమవుతున్న అత్యుత్తమ 5 బ్రాండ్లలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. 2010-11లో ఈ మోడల్లో సీఎన్జీ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. గతనెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో వ్యాగన్ ఆర్ మూడో స్థానంలో నిలిచిందని సియామ్(సొ సైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మాన్యుఫాక్చరర్స్) వెల్లడించిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 1,56,000 కార్లను విక్రయించామని, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ 93 వేలకు పైగా కార్లను అమ్మామని చెప్పారు. కాగా ఈ కంపెనీ మోడళ్లు- మారుతీ 800, ఆల్టోలు ఒక్కోటి 25 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.