వీడని కరోనా కష్టాలు : 29వేల దిగువకు సెన్సెక్స్ | Coronavirus Sensex opens over 1000 points lowerC | Sakshi
Sakshi News home page

వీడని కరోనా కష్టాలు : 29వేల దిగువకు సెన్సెక్స్

Mar 30 2020 9:37 AM | Updated on Mar 30 2020 12:05 PM

Coronavirus Sensex opens over 1000 points lowerC - Sakshi

సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు  నష్టాలతో ప్రారంభమైనాయి. కరోనా కల్లోలం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. దీంత దేశీయంగా కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. సెన్సెక్స్ ప్రారంభంలోనే వెయ్యి పాయింట్లను కోల్పోయింది.  బ్యాంకులు,  ఫార్మ రంగ షేర్లతో పాటు దాదాపు అన్ని రంగాల  షేర్లు నష్టపోతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్పస్ 839 పాయింట్లు పతనమైన 28998 వద్ద, నిప్టీ  218 పాయింట్లు నష్టంతో 8452 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా 29 వేల దిగువకు చేరింది.  నిప్టీ కూడా 8400 దిగువకు చేరింది. నిఫ్టీ బ్యాంకు కూడా ఇదే బాటలో వుంది. బజాజ్  ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్,  ఎం అండ్ ఎం,  ఓఎన్జీసీ, యూపిఎల్,  శ్రీసిమెంట్స్  టాప్ లూజర్స్ గా ఉన్నాయి.  కాగా టీసీఎస్,  ఐటీసీ మాత్రం స్వల్పంగా లాభపడుతున్నాయి.  అటు డాలరు మారకంలో రుపీ కూడా  నెగిటివ్ గా వుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement