రూ.160 కోట్లకు అమ్ముడైన ఫ్లాట్ | 10,000 sq ft duplex goes for Rs 160cr in Mumbai | Sakshi
Sakshi News home page

రూ.160 కోట్లకు అమ్ముడైన ఫ్లాట్

Nov 26 2015 12:40 PM | Updated on Sep 3 2017 1:04 PM

ఇది ముఖేశ్ అంబానీ ఇల్లు. దీనికి సమీపంలోనే ప్లాట్ కొన్నారు

ఇది ముఖేశ్ అంబానీ ఇల్లు. దీనికి సమీపంలోనే ప్లాట్ కొన్నారు

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఓ డుప్లెక్స్ ఫ్లాట్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది.

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఓ డుప్లెక్స్ ఫ్లాట్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. ఆల్టమౌంట్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న లోధా ఆల్టమౌంట్ అపార్ట్ మెంట్ లోని డుప్లెక్స్ ఫ్లాట్ రూ. 160 కోట్లు పలికింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఫ్లాట్ ను నిర్మిస్తున్నారు.

జిందాల్ డ్రగ్స్ ఫార్మా వ్యాపారం నిర్వహిస్తున్న జిందాల్ కుటుంబం దీన్ని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఫ్లాట్ కొనుగోలులో ఇదే అతిపెద్ద డీల్ గా భావిస్తున్నారు. చదరపు అడుగుకు రూ. 1.60 లక్షలు చొప్పున చెల్లించింది. ముఖేశ్ అంబానీ నివాసం ఆంటీలియాకు సమీపంలో 24 అంతస్థుల్లో నిర్మితమవుతున్న ఈ అపార్ట్ మెంట్ 18 నెలల్లో పూర్తి కానుంది. 2017, ఏప్రిల్ నాటికి నిర్మాణం పూర్తవుతుందని లోధా ప్రతినిధి వెల్లడించారు.

గత సెప్టెంబర్ లో బ్రీచ్ కాండీలో ఓ భవంతిని సైరస్ పూనావాలా రూ. 750 కోట్లకు కొనుగోలు చేశారు. దేశంలో ప్రైవేటు గృహాల కొనుగోలులో అత్యంత ఖరీదైన డీల్ గా ఇది గుర్తింపు పొందింది.

Advertisement
 
Advertisement
Advertisement