ఎన్టీఆర్ జయంతి ప్రతి ఒక్కరికి పండగ రోజు | YVS Chowdary pay tributes to NTR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ జయంతి ప్రతి ఒక్కరికి పండగ రోజు

May 28 2015 9:03 AM | Updated on Aug 28 2018 4:30 PM

ఎన్టీఆర్ జయంతి ప్రతి ఒక్కరికి పండగ రోజు - Sakshi

ఎన్టీఆర్ జయంతి ప్రతి ఒక్కరికి పండగ రోజు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జయంతి ప్రతి ఒక్కరికి పండగ రోజు అని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జయంతి ప్రతి ఒక్కరికి పండగ రోజు అని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద దివంగత నటుడికి వైవీఎస్ చౌదరి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైవీఎస్ మాట్లాడుతూ... రిక్షావాడి నుంచి రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, విదేశీ శాస్త్రవేత్తల వరకు అందరికీ ఎన్టీఆర్ జీవితం ఆదర్శమన్నారు.

హైందవ సంప్రదాయంలో భాగమైన రామాయణ, మహాభారతం, భాగవతంలోని వివిధ పాత్రలకు జీవం పోసిన మహానటుడు ఎన్టీఆర్ అని ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్కు భారతరత్న వచ్చేలా తెలుగు ప్రజలందరూ కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు వివిధ పార్టీల నేతలు కృషి చేయాలని వైవీఎస్ ఈ సందర్భంగా కోరారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement