ఎల్లుట్లలో వైసీపీ కార్యకర్త హత్య

ఎల్లుట్లలో వైసీపీ కార్యకర్త హత్య - Sakshi


* అనంతపురం జిల్లాలో దారుణం

* కర్రలు, రాడ్లతో టీడీపీ శ్రేణుల స్వైరవిహారం

* వాన నీటిని అడ్డుకున్నాడని ప్రాణం తీశారు!

* ఇల్లు దెబ్బ తింటుందని అభ్యంతరం చెప్పిన వైసీపీ నేత


 

 సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అధికార టీడీపీ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్లలో టీడీపీ వర్గీయులు వైసీపీ కార్యకర్తను పొట్టనబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చాక జిల్లాలో టీడీపీ కార్యకర్తలు చేసిన రెండో హత్య ఇది. గ్రామంలోని ఎగువ బజార్‌లో ఇటీవల చేపట్టిన సిమెం టు రోడ్డు నిర్మాణంతో వర్షం నీరు నిలిచిపోయింది. కొందరు టీడీపీ కార్యకర్తలు ఈ నీటిని వైఎస్సార్ సీపీ నేత శేఖర్ ఇంటి సందులోకి మళ్లించారు. ఇంటి గోడను ఆనుకుని నీరు నిల్వ ఉంటే పునాదులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో శేఖర్ వద్దని వారించినా టీడీపీ వారు వినిపించుకోలేదు.

 

 దీంతో నీరు తన ఇంటివైపు రాకుండా మట్టి, రాళ్లతో శేఖర్ అడ్డుకట్ట వేయించా డు. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహానికి అడ్డు తొలగించాంటూ టీడీపీ వర్గీయులు శుక్రవారం శేఖర్ ఇంటి వద్ద దౌర్జన్యానికి దిగారు. అక్కడ ఉన్న మల్లికార్జున, రామయ్య, రాజు, లక్ష్మీప్రసాద్, కుమార్ తదితరులు టీడీపీ కార్యకర్తలను వారించటంతో కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. మల్లికార్జున, రామయ్యల తలలు పగులగొట్టారు. తీవ్రంగా గాయప డ్డ వీరిని గ్రామస్తులు 108 ద్వారా అనంతపురం జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మల్లికార్జున(42) దారిలో చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రామయ్య, స్వల్పగాయాలైన రాజు, లక్ష్మీప్రసాద్, కుమార్ చికిత్స పొం దుతున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ గెలుపు కోసం మల్లికార్జున, శేఖర్, రాజు కృషి చేశారు. వీరి కృషి ఫలితంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి లక్ష్మీదేవమ్మ ఎంపీటీసీగా గెలుపొందటంతో టీడీపీ శ్రేణులు కక్ష పెంచుకుని దాడి చేశారని బాధితులు తెలిపారు. మల్లికార్జునకు భార్య సుబ్బరత్నమ్మ, కుమార్తె రేణుక, కుమారుడు మణికంఠ ఉన్నారు. అధికారపార్టీ ఆగడాలపై వైఎస్సార్ సీపీ నేతలు గురువారమే జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. భద్రత కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చిన 24 గంట ల్లోనే వైఎస్సార్ సీపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top