ఆయనకు భయం పట్టుకుంది అందుకే..! | YSRCP MLA Partha Sarathi Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

రాష్ట్రాభివృద్ధి కోసమే వికేంద్రీకరణ

Feb 22 2020 6:24 PM | Updated on Feb 22 2020 6:31 PM

YSRCP MLA Partha Sarathi Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రాభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తెలిపారు. శనివారం ఆయన తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... అమరావతి రైతులను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాతే  రైతులకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అవినీతి బయటకు వస్తుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే చంద్రబాబు, ఎల్లోమీడియా ఆరాటమని విమర్శించారు.(రాజధాని భూముల అవినీతిపై సిట్‌ ఏర్పాటు)

అవినీతి బయటపెడితే బీసీల దాడి అంటున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారన్నారు. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అవినీతి బయటకొచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అక్రమ సొమ్ము మొత్తం చంద్రబాబు వద్దకే చేరిందని ఆరోపించారు. చంద్రబాబు పాత్రపై కూడా సిట్‌ విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని పార్థసారధి మండిపడ్డారు.
(వికేంద్రీకరణతోనే ప్రగతి)

Advertisement
 
Advertisement
Advertisement