'వైఎస్ హయాంలో అలా.. బాబు పాలనలో ఇలా' | ysrcp MLA Jaleel khan takes on chandra babu | Sakshi
Sakshi News home page

'వైఎస్ హయాంలో అలా.. బాబు పాలనలో ఇలా'

Dec 22 2014 11:39 AM | Updated on Jul 28 2018 6:35 PM

'వైఎస్ హయాంలో అలా.. బాబు పాలనలో ఇలా' - Sakshi

'వైఎస్ హయాంలో అలా.. బాబు పాలనలో ఇలా'

విజయవాడలో పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు తొక్కిసలాటలో చనిపోయిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: విజయవాడలో పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు తొక్కిసలాటలో చనిపోయిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్ల పంపిణీలో తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేసేవారని జలీల్ ఖాన్ గుర్తుచేశారు. అప్పట్లో వృద్ధులకు ఎలాంటి సమస్యలు ఉండేవికావని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చడం, పెన్షన్ల పంపిణీలో తగిన చర్యలు తీసుకోకపోవడంతో  దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడంలో రెండు రోజుల క్రితం కూడా తోపులాట జరిగిందని జలీల్ ఖాన్ చెప్పారు. వృద్ధురాలు మరణించిన ఘటనపై చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement