నిందితులను కఠినంగా శిక్షించాలి | YSRCP Leader Vasireddy Padma Fires On TDP Leaders | Sakshi
Sakshi News home page

నిందితులను కఠినంగా శిక్షించాలి

Sep 3 2019 3:05 PM | Updated on Sep 3 2019 3:19 PM

YSRCP Leader Vasireddy Padma Fires On TDP Leaders - Sakshi

సాక్షి, విజయవాడ: తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ గుంటూరు రూరల్‌ ఎస్పీని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఎస్పీని కలిసి మాట్లాడారు. అసలు మహిళా దళిత ఎమ్మెల్యేకే రక్షణ లేదని.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అంటరానితనాన్ని రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. దళిత ఎమ్మెల్యే.. దేవుడు దగ్గరకు వెళ్ళితే మైలు పడతారని మాట్లాడటం ప్రజాస్వామ్య,రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.

రౌడీల్లా రెచ్చిపోతున్నారు..
గుంటూరు:దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతల దౌర్జన్యం దారుణమని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీల్లా ప్రవర్తిస్తూ.. టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement