'చనిపోయినవారు స్మగ్లర్లా? కూలీలా?' | YSRCP demands to judicial enquiry on Seshachalam encounter | Sakshi
Sakshi News home page

'చనిపోయినవారు స్మగ్లర్లా? కూలీలా?'

Apr 7 2015 11:06 PM | Updated on May 25 2018 7:29 PM

అంబటి రాంబాబు - Sakshi

అంబటి రాంబాబు

శేషాచలం ఎన్కౌంటర్పై న్యాయవిచాణ జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

గుంటూరు: శేషాచలం ఎన్కౌంటర్పై న్యాయవిచాణ జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా  తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగి, దాదాపు 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయినవారు స్మగ్లర్లా? కూలీలా? అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని అంబటి డిమాండ్ చేశారు.

తమ కూలీలను ఆంధ్ర పోలీసులు చంపేశారని తమిళ నేతలు అంటున్నారని చెప్పారు. న్యాయవిచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలని అంబటి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement