బాబుకు ప్రజాశ్రేయస్సు పట్టదా? | ysr congress leaders fires on chandra babu naidu | Sakshi
Sakshi News home page

బాబుకు ప్రజాశ్రేయస్సు పట్టదా?

Dec 18 2013 6:27 AM | Updated on Jul 28 2018 6:33 PM

బాబుకు ప్రజాశ్రేయస్సు పట్టదా? - Sakshi

బాబుకు ప్రజాశ్రేయస్సు పట్టదా?

బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రజా శ్రేయస్సు పట్టదా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తన పార్టీ రెండు ప్రాంతాల్లో బతకాలంటారే తప్ప, ప్రజల శ్రేయస్సు కోసం రెండు ప్రాంతాలు కలిసుండాలని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు.

సాక్షి, హైదరాబాద్: బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రజా శ్రేయస్సు పట్టదా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తన పార్టీ రెండు ప్రాంతాల్లో బతకాలంటారే తప్ప, ప్రజల శ్రేయస్సు కోసం రెండు ప్రాంతాలు కలిసుండాలని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, టి.బాలరాజు, శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విభజన వల్ల రెండు ప్రాంతాలకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిసినప్పటికీ తన రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నారని చంద్రబాబుపై భూమన మండిపడ్డారు.ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మాదిరిగా చంద్రబాబు కూడా ఇంత ఘోరంగా దిగజారడం చూసి ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తాము మాత్రం ప్రజల తరఫునే నిలబడ్డామని, రాజకీయంగా నష్టపోయినా ఫర్వాలేదని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని బీరాలు పలికి, చివరకు విభజనకు తలుపులు బార్లా తెరిచిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
 
 బీఏసీకి హాజరు కాలేదేమి?: h
 ప్రధాన ప్రతిపక్షస్థానంలో ఉన్న చంద్రబాబు బీఏసీ సమావేశానికి హాజరుకాకపోవడాన్ని ఏ సిద్ధాంతమంటారో ఆయనే చెప్పాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఏసీకి కూడా బాబు ఇరుప్రాంత నేతలను పంపించి ద్వంద్వ వైఖరిని అవలంబించారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement